Site icon NTV Telugu

Karnataka: సీఎం సిద్ధరామయ్యకు అవమానం.. రివార్డ్ తిరస్కరించిన ఖో ఖో ప్లేయర్స్

Cm

Cm

క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఏవైనా పతకాలు సాధించినప్పుడు ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహం మరింత ఉత్తేజపరుస్తాయి. ఇలా ఆయా రకాలైన ఆటల్లో చూస్తుంటాం. అలాంటిది కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన బహుమతి విమర్శలకు దారి తీసింది. ఇద్దరు ఆటగాళ్లు నగదు బహుమతిని తిరస్కరించారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి తీవ్ర అవమానం జరిగినట్లైంది.

ఎంకే. గౌతమ్, చైత్ర బి… ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన పురుషులు, మహిళల జట్లలో భాగంగా ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. అయితే ఈ నగదు అవమానంగా భావించారు. అంతే ప్రభుత్వం ప్రకటించిన రివార్డ్‌ను క్రీడాకారులిద్దరూ తిరస్కరించారు. అయితే తాము నగదు తిరస్కరించడం వల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అగౌరవపరచడం లేదన్నారు. కానీ మాకు తగిన గౌరవం లభించలేదని గౌతమ్ అన్నారు. మహారాష్ట్రలో తమ ఆటగాళ్లకు మెరుగైన మద్దతు ఇచ్చిందని ఆటగాళ్ళు గుర్తుచేశారు. గౌతమ్‌తో పాటు చైత్ర కూడా ప్రభుత్వ స్పందన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇతర ప్రపంచకప్ ఆటగాళ్లకు ఇచ్చే మొత్తాన్ని మేం డిమాండ్ చేస్తున్నామని, ఇతర క్రీడాకారుల మాదిరిగానే మనకు కూడా పతకాలు వచ్చాయి. అయితే క్రీడాకారులకు వివిధ ఆటలకు ఇచ్చే సౌకర్యాలను కోల్పోతున్నామని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?

ఇదిలా ఉంటే ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన మహారాష్ట్ర క్రీడాకారులకు అక్కడి ప్రభుత్వం రూ.2.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యోగాలను కూడా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం.. క్రీడాకారులను ఉన్నతంగా గౌరవిస్తే.. కర్ణాటక ప్రభుత్వం తమను చిన్నచూపు చూసినట్లుగా క్రీడాకారులు భావించారు. దీంతో బహుమతిని తిరస్కరించారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. క్రీడాకారులను సత్కరించి, వారి విజయాలను ప్రశంసించినప్పటికీ.. గౌతమ్, చైత్ర మాత్రం గౌరవం సరిపోదని భావించారు. నగదు బహుమతి తమను క్రీడలో కొనసాగేందుకు ప్రోత్సహించదని, ఖో ఖోను కొనసాగించేందుకు ఇతరులను ప్రేరేపించదని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని క్షుణ్ణంగా సమీక్షించాలని, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎలా జరిగిందో చూసి, ఆపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Thandel Trailer: తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్.. నాగచైతన్య మాస్ ట్రీట్ రెడీ!

Exit mobile version