Site icon NTV Telugu

త‌మిళ‌నాడు బాట‌లో క‌ర్ణాట‌క కూడా…బెంగ‌ళూరుకు వెళ్లాలంటే…

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  త‌మ రాష్ట్రానికి వ‌చ్చే వారు త‌ప్ప‌ని స‌రిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల‌ని ష‌ర‌తులు విధించింది.  ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ స‌ర్టిఫికెట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమ‌తి ఇస్తామ‌ని స‌ర్కార్ ఖ‌చ్చింతంగా చెప్పింది.  కేర‌ళ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  ఇక‌, త‌మిళ‌నాడు బాట‌లో ఇప్పుడు క‌ర్ణాట‌క కూడా ప‌య‌నిస్తోంది.  క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరుకు కేర‌ళ‌, మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  దీనికి సంబందించి ప్ర‌త్యేక నిఘా బృందాల‌ను ఏర్పాటు చేసింది బెంగ‌ళూరు బృహ‌త్త‌ర మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌.  అన్ని చెక్‌పాయింట్ల వ‌ద్ద నిఘాను పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  

Read: “రాక్షసుడు-2” కోసం షాకింగ్ బడ్జెట్

Exit mobile version