ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్‌లపై నిఘాను ఉంచారని, ఫోన్‌లను ట్యాపింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోవడానికి కూడా స్పైవేర్ కారణమని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. గత 10-15 ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వాలు, ఆదాయపన్ను శాఖ ప్రజల ఫోన్లను ట్యాపింగ్ చేసేవారని తెలిపారు. దేశ భద్రత విషయంలోగాని, కర్ణాటక విషయంలోగాని ఎలాంటి తప్పులు చేయలేదని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలైనా సమాచారం కోసం, లేదా తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమో ఇలా చేస్తుంటారని, వీటిపై తనకు ఆసక్తి లేదని అన్నారు.
ఫోన్ నిఘాపై మాజీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు…
