పవర్ స్టార్ ఫ్యాన్ గా సందీప్ రెడ్డి వంగా!

ఇవాళ డైరెక్టర్స్ గా టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళంతా యవ్వనంలో ఆనాటి స్టార్స్ కు బిగ్ ఫ్యాన్స్ అయ్యే ఉంటారు! ఆ అభిమానమే వాళ్ళను సినిమా రంగం వైపు మళ్ళేలా చేసి ఉంటుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే యూత్ లో సునామి సృష్టించిన సందీప్ రెడ్డి వంగా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇరవై ఏళ్ళ క్రితం ఇతను పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే వాడట. దానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతరను ఇటీవలే సోషల్ మీడియాలో పొందుపరిచాడు సందీప్ రెడ్డి వంగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఖుషీ’, అతను దర్శకత్వం వహించిన ‘జానీ’ చిత్రాల ఆడియో కేసెట్స్ కవర్స్ తో పాటు అప్పట్లో పవన్ చేసిన పెప్సీ యాడ్ తాలూకు పోస్టర్ ను ఇటీవల సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశాడు. ఇది తన జ్ఞాపకాల బంగారు నిధి అంటూ ఈ ఫోటోపై సందీప్ రాశాడు.

Read Also : భారీ చిత్రాల నిర్మాతకు హార్ట్ సర్జరీ

ఇక సందీప్ రెడ్డి వంగా మూవీస్ విషయానికి వస్తే, తెలుగు ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ తో ‘యానిమల్’ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే అంటూ చెబుతున్న సందీప్ వంగాతో పవర్ స్టార్ సినిమా చేస్తే చూడాలని ఉందంటూ అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా పవన్ కళ్యాణ్ ఆ ఛాన్స్ సందీప్ కు ఇస్తాడేమో చూడాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-