Site icon NTV Telugu

Congress: గత రికార్డులను తుడిచిపెట్టిన కాంగ్రెస్.. 1989 తర్వాత భారీగా ఓట్లు, సీట్లు..

Congress

Congress

Congress: కర్ణాటక విజయంతో కాంగ్రెస్ విజయంతో గత రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కన్నడ ఓటర్లు ఎంతో కసిగా ఓటేసినట్లు అర్థం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కర్ణాటక నలువైపులా కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. దీంతో గతంలో ఉన్న అన్ని ఎన్నికల రికార్డులను తుడిచిపెటేసి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

Read Also: Nikhil Gowda: యంగ్‌ హీరోకి తప్పని ఓటమి.. అమ్మ త్యాగం చేసినా..!

1989 తర్వాత అంటే 34 ఏళ్ల తరువాత ఇలాంటి విజయం కాంగ్రెస్ కు దక్కింది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, డీకే శివకుమార్ చాణక్యం, సిద్దరామయ్య ఆకర్షణ బీజేపీ పార్టీ హేమాహేమీలను మట్టికరిపించాయి. చివరిసారిగా 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 43.76 శాతం ఓట్ షేర్ తో ఏకంగా 178 స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా గత ఎన్నికల రికార్డును 2023 ఎన్నికల్లో తిరగరాసింది. ప్రస్తుతం 43 శాతం ఓట్ షేర్ తో 136 స్థానాలను కైవసం చేసుకుంది.

ప్రముఖ రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఈ గణాంకాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కర్ణాటకలో ఏ పార్టీ కైనా ఇదే అతిపెద్ద విజయమని అన్నారు. 1994లో జేడీఎస్ 33.54 ఓట్ల శాతంతో మొత్తం 115 సీట్లు గెలుచుకుంది. 1999లో కాంగ్రెస్ 40.84 శాతం ఓట్లతో 132 సీట్లు గెలుచుకుంది. ఆ తరువాత 2004లో బీజేపీ 28.33 శాతం ఓట్లతో 79 సీట్లలో విజయం సాధించింది. 2008లో బీజేపీ 36.86 శాతం ఓట్లతో 110 సీట్లు గెలచుకుంది. 2013లో కాంగ్రెస్ మళ్లీ 36.6 శాతం ఓట్లతో 122 స్థానాలను గెలుచుకుంది. 2018లో 36.3 శాతం ఓట్లతో బీజేపీ 104 స్థానాలను గెలుచుకుంటే.. 2023లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 43 శాతం ఓట్లతో 136 స్థానాల్లో గెలుపొందింది.

Exit mobile version