Site icon NTV Telugu

Karnataka High Court: కర్ణాటక హైకోర్టులో కేఎస్‌సీఏకు బిగ్ రిలీఫ్.. చర్యలు తీసుకోవద్దని వెల్లడి

High Court

High Court

Karnataka High Court: ఐపీఎల్‌ 2025 ఛాంపియన్ గా నిలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (KSCA) వెల్లడించింది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్‌ నిర్వాహకుల తీరు వల్లే కొనసాగిందన్నారు. అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు.. వారు చేసిన పొరపాటుకు కేఎస్‌సీఏపై కేసులు పెట్టడం తగదని విమర్శించింది. దీనిపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Read Also: Top Maoist Leader: బీజాపూర్‌లో మరో ఎన్కౌంటర్.. రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు మృతి?

ఇక, బెంగళూరు తొక్కిసలాటకు సంబంధించి కర్ణాటక స్టేట్‌ క్రికెట్ అసోసియేషన్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కేఎస్‌సీఏపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేఎస్‌సీఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించా.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ఇచ్చింది.

Read Also: NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

అయితే, ఆర్సీబీ జట్టు విజయోత్సవ ర్యాలీతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేఎస్‌సీఏ వెల్లడించింది. ప్లేయర్స్ ను సత్కరించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.. అది కూడా ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగలేదు.. విధాన సౌధ దగ్గర కొనసాగదింది.. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్‌ మంత్రులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అధికారులు పర్మిషన్ ఇచ్చారు.. ఇందులో కేఎస్‌సీఏ జోక్యం కొంచెం కూడా లేదన్నారు. కేవలం వేదికను రెండ్ కు ఇవ్వడం, క్రికెట్‌ సంబంధిత వ్యవహారాల వరకే ఆసోసియేషన్‌ బాధ్యత తీసుకుంటుందని కేఎస్‌సీఏ పేర్కొనింది.

Exit mobile version