Site icon NTV Telugu

Siddaramaiah: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. ఈసీ తీరుపై సిద్ధరామయ్య ఆరోపణలు

Siddaramaiah

Siddaramaiah

ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓ జాతీయ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు సిద్ధరామయ్య మద్దతు తెలిపారు. నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని.. నకిలీ పేర్లను చేరుస్తున్నారని రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవమని.. నిజం మాట్లాడారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: మరింత దిగువకు పసిడి.. నేటి ధరలు ఇలా..!

ఎన్నికల కమిషన్ స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా పని చేయడం లేదని ఆరోపించారు. కేంద్రం మద్దతుతో ప్రజాస్వామ్య సంస్థలను ఎన్నికల సంఘం బలహీనపరుస్తోందని పేర్కొన్నారు. కేవలం కేంద్రం ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందని.. అందుకే ఈసీ స్వతంత్రమైనది కాదన్నారు. వాస్తవానికి స్వతంత్రంగా, న్యాయంగా పని చేయాల్సి ఉంది.. కానీ అలా చేయడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణల కోసం ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా త్వరలో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. దేశవ్యాప్తంగా కుల గణన జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి రాష్ట్రం కుల గణనను ప్రారంభించాలన్నారు.

ఇది కూడా చదవండి: IMD Warning AP: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తాను ఓబీసీ సలహా కమిటీ కన్వీనర్ కాదని, అనిల్ జైహింద్ నాయకత్వంలోని సభ్యుడిని అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కుల గణన ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చామని, గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version