NTV Telugu Site icon

Siddaramaiah: చంపేస్తామంటూ సిద్ధరామయ్యకు బెదిరింపు కాల్స్‌.. విచారణకు ఆదేశించిన సీఎం

Siddaramaiah

Siddaramaiah

Siddaramaiah: కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం తెలిపారు. తాను కాంగ్రెస్ నాయకుడిని కలిశానని, తగిన భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చానని తెలిపారు. కొడగు పర్యటనలో సిద్ధరామయ్య తన కారుపై గుడ్లు విసిరి, నల్ల జెండాలు ప్రదర్శించిన తర్వాత ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు.

సర్కారు ఈ విషయంపై సీరియస్‌గా ఉందని.. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సిద్ధరామయ్యకు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. . బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిద్ధరామయ్యను కోరానని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తానని ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి డీజీపీతో కూడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. విషయంపై ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు.

Delhi Man Arrest: ఉగ్రవాద చర్యల కోసం నిధులను మళ్లిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఇతరులను రెచ్చగొట్టేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ఎవరూ ప్రకటనలు చేయవద్దని ఎస్పీలందరికీ ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడికి తగిన భద్రతను, అవసరం అయితే అదనపు భద్రత కల్పించాలని ఆదేశించానని బొమ్మై తెలిపారు. అంతకుముందు, సిద్ధరామయ్య ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఈ వ్యక్తులు గాంధీని చంపారు, వారు నన్ను వదిలేస్తారా?’ అని పేర్కొన్నారు. గాంధీని కాల్చిన గాడ్సే ఫోటోకు పూజలు చేస్తున్నారని విమర్శించారు.