Site icon NTV Telugu

Karnataka: కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రభుత్వం అభ్యంతరం.. 4న కేబినెట్ భేటీ

Patial

Patial

కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై కర్ణాటక ప్రభుత్వం మండిపడింది. దీనికి వ్యతిరేకంగా గురువారం కర్ణాటక కేబినెట్ సమావేశం కానుంది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో తీవ్రమైన లోపాలున్నాయని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. సవరణలపై చర్చించేందుకు జులై 4న కేబినెట్‌ సమావేశం అవుతున్నట్లు తెలిపారు. తమ 23 సిఫార్సులను పట్టించుకోలేదని రాష్ట్రం చెబుతోంది.

ఇది కూడా చదవండి: Coin Stuck In Man’s Windpipe: వ్యక్తి శ్వాసనాళంలో 8 ఏళ్లుగా 25 పైసల నాణేం.. అరుదైన శస్త్రచికిత్స..

కొత్త చట్టాల రూపకల్పన సమయంలో మోడీ, అమిత్ షాలకు పంపిన 23 సిఫార్సులను విస్మరించారని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపించింది. కొత్త చట్టాలతో లాభాలు కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయని పాటిల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Aparna Cinema: ఓపెనైన నెల్లో కల్కిపై కోటి గ్రాస్ సంపాదించిన మల్టీప్లెక్స్

Exit mobile version