కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. సోమవారం కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పూనుకున్నారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు. సామవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధపడుతుండగా ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి.
పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించగా… రేపు రాజీనామా చేయనున్నట్లు ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ తెలిపారు. తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేయనున్నట్లు గోపాలకృష్ణ వెల్లడించారు.
రాష్ట్ర మంత్రివర్గంలో 34 మందికి అవకాశం ఉండగా.. జూన్ 4న ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరతో సహా 13 మంది కేబినెట్ మంత్రులతో కలిసి శివకుమార్ కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు . దీంతో 20 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సోమవారం అధిష్టానం ఆదేశాలతో భర్తీ చేస్తున్నారు. అయితే ఈ కేబినెట్ కూర్పుపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేగాయి.
ఇక స్పీకర్ యూటీ ఖాదర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంతో రోన్ ఎమ్మెల్యే జీఎస్.పాటిల్ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. విరాజ్‌పేట ఎమ్మెల్యే పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మంత్రుల జాబితా ఇదే
లక్ష్మణ్ సవాడి
విజయానంద కశప్పనవర్
బసవరాజ్ రాయరెడ్డి
గాయత్రి శాంతే గౌడ
హెచ్‌సీ.బాలకృష్ణ
కేఎం.శివలింగే గౌడ
చెలువరయస్వామి
అజయ్ సింగ్
ఎస్ఎస్.మల్లిఖార్జున
పుట్టురంగశెట్టి
మధు బంగారప్ప
సంతోష్ లాడ్
రిజ్వాన్ అర్షద్
జమీర్ అహ్మద్ ఖాన్
రఘుమూర్తి
నాగేంద్ర
బసవంతప్ప
రుద్రప్ప లమణి
శివరాజ్ తంగడిగి
నరేంద్ర స్వామి

