Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- గురుగ్రామ్‌లో కార్గిల్ వార్ వెటరన్‌పై దాడి
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kargil War Veteran Assaulted With Iron Rod in Gurugram: కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన కేసులో పార్కింగ్ అటెండెంట్‌ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా కోట్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దీపక్ మావీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్కింగ్ వివాదం నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు.
పార్కింగ్ విషయంలో వివాదం
పోలీసులు, బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. సెప్టెంబర్ 10న గురుగ్రామ్‌లోని సెక్టార్ 58లో ఉన్న మాగ్నమ్ గ్లోబల్ పార్క్ వాణిజ్య సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ కుమార్ గుప్తా తన కుటుంబంతో కలిసి గోంజో రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం వెళ్లారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులను రెస్టారెంట్లో వదిలి, కారు పార్క్ చేసేందుకు వెళ్లారు. అయితే పార్కింగ్ సిబ్బంది వాలెట్, బేస్మెంట్, మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తూ కొంతసేపు తిప్పారని గుప్తా ఆరోపించారు. చివరకు తన కారును పార్క్ చేసేందుకు నిరాకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇనుప పైపుతో తలపై దాడి
కారు రివర్స్ చేస్తున్న సమయంలో ఓ పార్కింగ్ అటెండెంట్ తన కారు ముందు అద్దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడని గుప్తా ఆరోపించారు. దీంతో తాను కారు దిగి అడ్డుకున్నానని, ఆ తర్వాత ఆ వ్యక్తి ఇనుప రాడ్‌తో వచ్చి మొదట చేతిపై, అనంతరం తలపై కొట్టాడని అమిత్ కుమార్ గుప్తా తెలిపారు.
తీవ్ర గాయాలు.. శస్త్రచికిత్స
ఈ దాడిలో తనకు తలకు తీవ్ర గాయమైందని, మోచేయి ఎముక విరిగిందని గుప్తా తెలిపారు. ఘటన అనంతరం అంబులెన్స్‌లో గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మోచేయికి శస్త్రచికిత్స చేసి ప్లేట్ అమర్చినట్లు చెప్పారు. సెప్టెంబర్ 10 నుంచి ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
రెస్టారెంట్ చెఫ్ జోక్యంతో పరిస్థితి అదుపులోకి
దాడి జరుగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది, పార్కింగ్ సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ జోక్యం చేసుకోలేదని గుప్తా ఆరోపించారు. తాను పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పటికీ, పోలీసులు సుమారు అరగంట వరకు ఘటనాస్థలానికి రాలేదని తెలిపారు. అయితే ఓ రెస్టారెంట్ చెఫ్ జోక్యం చేసుకుని పరిస్థితి మరింత తీవ్రం కాకుండా అడ్డుకున్నారని గుప్తా పేర్కొన్నారు.
సెప్టెంబర్ 13న కేసు నమోదు
అమిత్ కుమార్ గుప్తా ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 13న సెక్టార్ 65 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 126(2), 351(3) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల అభిప్రాయం ఆధారంగా మరిన్ని సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటన సమయంలో అక్కడ ఉన్న ఇతరుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కార్గిల్ యుద్ధంలో సేవలు
అమిత్ కుమార్ గుప్తా భారత వైమానిక దళంలో సేవలందించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ బృందంలో ఆయన భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కార్గిల్ యుద్ధ వీరుడిపై జరిగిన ఈ దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
🚨 सेवानिवृत अधिकारी से मारपीट करने वाला आरोपी FIR के 7 घंटे के अंदर गिरफ्तार।
थाना सैक्टर-65, गुरुग्राम में दर्ज मामले में पुलिस ने तत्परता से कार्रवाई करते हुए आरोपी दीपक मावी (24 वर्ष), निवासी गांव कोट, जिला फरीदाबाद को गिरफ्तार किया।#GurugramPolice #Gurugram #PoliceAction pic.twitter.com/wieGowZBmk— Gurugram Police (@gurgaonpolice) September 14, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!