Site icon NTV Telugu

నా శవం కూడా బీజేపీలో చేరదు.. కాంగ్రెస్‌ సీనియర్ నేత కామెంట్

Kapil Sibal

Kapil Sibal

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనే కాదు తన శవం కూడా భారతీయ జనతా పార్టీలో చేరదన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద తాజాగా బీజేపీలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జితిన్‌ ప్రసాద నిర్ణయం వ్యక్తిగతం అంటూనే.. ఇన్నేళ్లు వ్యతిరేకించిన పార్టీలో ఎలా చేరతారంటూ ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపికపై లేఖ రాసిన నేతల్లో కపిల్‌ సిబల్‌ కూడా ఒకరు.. అలాంటి సిబల్‌.. ఇప్పుడు ఇలా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా, వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌చేసిన బీజేపీ.. తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version