NTV Telugu Site icon

UP: డీసీపీ ఆఫీస్ దగ్గర గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే.. 12 కార్ల‌తో గ్యాంగ్‌స్టర్ హంగామా.. సీఎం యోగీ చూస్తే ఖతం..

Up Ganagstar

Up Ganagstar

UP: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ తన ప్రియురాలి బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేయడం వివాదాస్పదంగా మారింది. డీసీసీ ఆఫీస్‌కి సమీపంలో 12 ఎస్‌యూవీ కార్లతో స్టంట్స్ చేస్తూ నానా హాంగామా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కాన్పూర్‌లోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసీసీ కార్యాలయం వెనక ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌తో పాటు ఇందులో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రూల్స్ పట్టించుకోకుండా 12 వాహనాల కాన్వాయ్‌లో స్టంట్స్ చేస్తూ హంగామా చేశాడు. నెంబర్ లేని కార్లను డీసీసీ ఆఫీస్‌ దగ్గర నిర్భంగా నడిపాడు. కార్లలో విన్యాసాలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరారు. వీడియోల్లో బ్లాక్ స్కార్పియో వాహనాల కాన్వాయ్ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కారులో ముందు కూర్చున్న యువతి కెమెరా వైపు చేతులు ఊపుతూ కనిపించింది. ఈమెనే గ్యాంగ్ స్టర్ లవర్ అనే ఆరోపణలు ఉన్నాయి.

Read Also: HYDRA : ఆ ఫిర్యాదులపై హైడ్రా ఫోకస్‌.. రంగంలోకి హైడ్రా కమిషనర్‌

27 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌ అజయ్ ఠాకూర్‌పై మొత్తం 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇందులో టీనేజ్ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు డాక్టర్ దంపతుల కుమార్తెని బెదిరించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అతడి బెదిరింపులకు గురైన బాలిక అత్యాచారానికి గురైంది. పోలీసులు ఇతడిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, గ్యాంగ్ స్టర్ సోషల్ మీడియా వీడియోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ కళ్లలో పడితే అంతే సంగతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్తార్ అన్సారీ వంటి సీనియర్ గ్యాంగ్‌స్టర్స్ యోగి దెబ్బకు గజగజ వణికిపోయారు. చాలా మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. ఇలాంటి రీల్స్ చేసి ఆయన కళ్లలో కనకపడితే ప్రాణాలే ఉండవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments