Site icon NTV Telugu

Karnataka: బోర్డుపై రాయలేకపోయిన సాంస్కృతిక శాఖ మంత్రి.. నెటిజన్లు సెటైర్లు

Karnataka

Karnataka

మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లడం.. విద్యార్థులతో ముచ్చటించడం.. ఇంకొందరు బోర్డుపై ఏదొకటి రాయడం చేస్తుంటాం. ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇందులో విచిత్రం ఏముందంటారా? కర్ణాటకలో ఓ మంత్రి.. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి.. బోర్డుపై ఏదో రాయబోయి అభాసుపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రధాన పూజారికి ‘‘బ్రెయిన్ స్ట్రోక్’’.. పరిస్థితి విషమం..

కొప్పల్ జిల్లా కరటగి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం బోర్డుపై ‘శుభవాగాలి’ రాయడానికి నానా తంటాలు పడ్డారు. పక్కనే ఉన్న టీచర్లు.. సాయం చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా కన్నడలో ‘బెస్ట్ ఆఫ్ లక్’ రాయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇష్టమొచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ కూడా రాయలేని వ్యక్తిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. మంత్రిని చేశారంటూ విమర్శిస్తున్నారు. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కన్నడ మంత్రి అయిండి.. కన్నడలో పేరు కూడా రాయలేకపోవడం విడ్డూరం అంటూ ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇలాంటి వాళ్లను మంత్రులుగా ఎన్నుకున్నారంటూ విమర్శిస్తున్నారు.

ఇది కూడా చదవండి: West Bengal : ముగ్గురిని మింగిన డ్రైనేజ్ కెనాల్.. ఒక్కొక్కరికి రూ.10లక్షల పరిహారం

బాగల్‌కోట్‌కు చెందిన తంగడగి.. కనకగిరి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ కూడా చేశారు. కానీ కన్నడ పదం రాయలేకపోయారు. ఇక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప కూడా 2024లో కన్నడపై అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ఆయన తర్వాత తాజాగా ఇప్పుడో తంగడగి రెండో మంత్రి అయ్యారు.

 

 

Exit mobile version