Site icon NTV Telugu

Neeta Pawar Missing: కన్నడ నటుడి సోదరి మిస్సింగ్.. మూడు రోజులైనా..

Neeta Pawar Missing

Neeta Pawar Missing

Kannada Actor Naveen Krishna Sister Neeta Pawar Went Missing: కన్నడ నటుడు, దర్శకుడు నవీన్ కృష్ణ ఇంట ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆయన సోదరి నీతా పవార్ కనిపించకుండా పోయింది. ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన నీతా.. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా నవీన్ కృష్ణ సోషల్ మీడియా మాధ్యమంగా వెల్లడించాడు. తన సోదరి ఫోటోని షేర్ చేస్తూ.. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాడు. ఆమె ఆచూకీ తెలిస్తే.. వెంటనే తమకు సమాచారం అందజేయాల్సిందిగా కొన్ని ఫోన్ నంబర్లు కూడా మెన్షన్ చేశాడు. అనంత్‌ (6364830333), అరుణ్ (9886624340), శ్వేత (8861526185), సునీల్ (9886525251) పేరిట ఫోన్ నంబర్స్ షేర్ చేసి.. తన సోదరి ఆచూకీ లభ్యమైతే, ఆ నంబర్స్‌కి సంప్రదించాలని తన పోస్టులో పేర్కొన్నాడు.

Himanta Biswa Sarma: “షారుఖ్ ఖాన్ ఎవరు..?” అస్సాం సీఎం ప్రశ్న..

నవీన్ కృష్ణ పెట్టిన పోస్టు ప్రకారం.. నీతా పవార్ సుబ్రమణ్యపుర పరిధిలో నివాసం ఉంటోంది. ఆమె అదృశ్యమైన విషయం తెలిసి.. నవీన్ కృష్ణ వెంటనే తన సోదరి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వారు, ఆమెకు తెలిసిన బంధుమిత్రుల్ని సంప్రదించాడు. కానీ.. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్వయంగా నీతానే ఇంటి నుంచి వెళ్లిపోయిందా? లేకపోతే ఆమెని మార్గమధ్యంలో ఎవరైనా అపహరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చివరగా ఆమె ఫోన్ సిగ్నల్ ఎక్కడ కట్ అయ్యిందో వివరాల్ని సేకరించి, దాని ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఉన్నపళంగా నీతా పవార్ ఇలా అదృశ్యం అవ్వడంతో.. నటుడు నవీన్ కృష్ణ ఇంట్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.

Guinnis Record: ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్.. గిన్నిస్ రికార్డుల్లో చోటు

ఇదిలావుండగా.. ప్రముఖ కన్నడ నటుడు శ్రీనివాస్ మూర్తి తనయుడిగా నవీన్ కృష్ణ బాలనటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. సినిమాలతో పాటు టీవీ షోలకు దర్శకత్వం వహించి, తనకంటూ మంచి గుర్తింపు గడించాడు. కదంబ, అమృతవాణి, దిమాక్, శ్రీహరికథ లాంటి పలు హిట్ సినిమాలలో నటించాడు. త్వరలోనే ‘భూమికే బండ భగవంత్’ సీరియల్‌‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Kamal Kamaraju: ఆ పని చేస్తూ.. పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు

Exit mobile version