Site icon NTV Telugu

Kanhaiya Kumar: కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి..

Kanhaiya Kumar

Kanhaiya Kumar

Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత, ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీచేస్తున్న కన్హయ్య కుమార్‌పై శుక్రవారం దాడి జరిగింది. ఆప్ కౌన్సిలర్‌పై కూడా దుండగులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆయన ఆరోపించారు. ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్ ఎన్నికల ప్రచారంలో ఉండగా దాడి జరిగింది. నార్త్ ఢిల్లీలో ఇండియా కూటమి తరుపున పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్ ప్రచారంలో ఉండగా.. పూలమాల వేసేందుకు దగ్గరకు వచ్చిన యువకుడు చెంపదెబ్బ కొట్టాడని సమాచారం. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్తార్ నగర్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్హయ్య కుమార్‌పై దాడి చేసిన అతడిని ఆయన మద్దతుదారులు పట్టుకున్నారు. ఆప్ మహిళా కౌన్సిలర్ ఛాయా గౌతమ్ శర్మపై కూడా దుండగులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

Read Also: Pakistan: భారత్ వాళ్లకు మద్దతు ఇస్తుంటే, మనం దొంగలుగా చూస్తున్నాం.. పాక్ మంత్రి ప్రశంసలు..

ఈ ఘటనపై ఛాయా గౌతమ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన శాలువా లాక్కెళ్లడంతో పాటు తన భర్తను పక్కకు తీసుకెళ్లి బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రచారం చేస్తున్న వారిపై నల్ల ఇంకు విసిరారని, 3-4 మంది మహిళలు కూడా గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్ పోటీ చేస్తుండగా.. బీజేపీ అభ్యర్థిగా మనోజ్ తివారీ బరిలో ఉన్నారు.

Exit mobile version