Site icon NTV Telugu

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షబీభత్సం.. కూలిపోయిన చక్కి వంతెన

Bridge Collapsed

Bridge Collapsed

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాంగ్రా జిల్లాలో ఉన్న చక్కి వంతెన శనివారం కూలిపోయిందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. ఈ ఉదయం రాష్ట్రంలోని మండి జిల్లాలో తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనివల్ల ఇళ్లు, దుకాణాల్లోకి నీరు ప్రవేశించింది. రహదారిపై ఆపి ఉంచిన ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని బాల్, సదర్, తునాగ్, మండి, లమథాచ్‌లోని ప్రదేశాలను ఈ వరదలు ప్రభావితం చేశాయని హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ బులెటిన్ పేర్కొంది.

మండిలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సూచనల దృష్ట్యా మండి జిల్లాలోని కాలేజీలు, ఐటీఐ మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆగస్టు 20న మూసివేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ అరిందం చౌదరి శుక్రవారం సాయంత్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం రాష్ట్రంలోని మండి ప్రాంతంలో మేఘావృతం కాగా.. కొండచరియలు విరిగిపడ్డాయి.

Mumbai: దేశ ఆర్థిక రాజధానికి బెదిరింపులు.. ఉగ్రదాడులు చేస్తామని పాక్‌ నుంచి సందేశం

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, చంబా, బిలాస్‌పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతికూల వాతావరణంలో నదులు, వాగుల దగ్గరకు వెళ్లవద్దని స్థానికులు, పర్యాటకులకు సూచించబడింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

Exit mobile version