ఈ ఏడాది క్లౌడ్ బరస్ట్‌లు కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చెందిన మండి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ నష్టాన్ని చవిచూసింది.
ఇది కూడా చదవండి: Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
అయితే గురువారం మండి నియోజకవర్గంలో కంగనా రనౌత్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ గోడును కంగనాకు చెప్పుకున్నారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కౌంటర్‌గా కంగనా తన బాధను ఎవరితో చెప్పుకోవాలంటూ రెస్టారెంట్ స్టోరీ మొదలు పెట్టారు.
నిన్న తన రెస్టారెంట్ అమ్మకాల్లో కేవలం రూ.50 మాత్రమే వచ్చాయని.. ప్రతి నెల ఉద్యోగులకు రూ.15 లక్షలు ఇస్తున్నానని.. దయచేసి తన బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలని రివర్స్‌గా నిట్టూర్పు విడిచింది. దీంతో వరద బాధితులంతా షాక్‌కు గురయ్యారు. తాను కూడా హిమాచల్‌ప్రదేశ్ ప్రాంత వాసినేనని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: డ్యామేజ్ కంట్రోల్‌లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
కంగనా రనౌత్ ఈ ఏడాది ప్రారంభంలో మనాలిలో రెస్టారెంట్ ది మౌంటైన్‌ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాలో పబ్లిసిటీ కూడా చేశారు. రెస్టారెంట్‌లో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అద్భుతమైన వంటకాలు అందించబడతాయని ప్రచారం చేశారు. అయితే ఈ రెస్టారెంట్ కేవలం పర్యాటకులకు మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే కొద్దిరోజులుగా భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో వ్యాపారం నడవడం లేదు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి.. తన ఆర్థిక కష్టాలు చెప్పుకోవడంతో వరద బాధితులు ఆశ్చర్యపోవడం వంతైంది.
కంగనా… సోలాంగ్, పాల్చన్ ప్రాంతాల్లో పర్యటించారు. కంగనాతో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఠాకూర్ ఉన్నారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కంగనా చెప్పుకొచ్చారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు కారణంగా ఇప్పటి వరకు 419 మంది చనిపోయారు.
