Site icon NTV Telugu

Kangana Ranaut: కంగనా రనౌత్ గొడ్డుమాంసం తింటుందన్న కాంగ్రెస్ నేత.. ఆమె స్పందన ఇదే..

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఆమె గొడ్డుమాంసం(బీఫ్) తింటుందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని ఆమె తోసిపుచ్చారు. తాను హిందువుగా గర్విస్తున్నానని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ‘‘ నేను గొడ్డు మాంసం లేదా మరే ఇతర రకాల రెడ్ మీట్ తినను, నాపై నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు’’ అని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Read Also: Pushpa 2 Teaser: 68 సెకండ్ల టీజర్.. చీరలో అల్లు అర్జున్!

తాను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని సమర్థిస్తున్నానని, వాటిని ప్రచారం చేస్తున్నానని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి పనిచేయవని అన్నారు. నా గురించి ప్రజలకు తెలుసని, నేను హిందువునని, జైశ్రీరాం అంటూ నినదించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పక్ష నేత విజయ్ వాడేట్టివార్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తాను బీఫ్ తనడాన్ని ఇష్టపడ్డానని ట్వీట్ చేశారని, బీజేపీ పార్టీ ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చిందని ఆరోపించిన నేపథ్యంలో కంగనా రనౌత్ స్పందించారు.

ఏప్రిల్ 5న మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో వాడెట్టివార్ మాట్లాడుతూ.. అవినీతి నాయకులందరికీ బీజేపీ స్వాగతం చెబుతోందని విమర్శించారు. బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే మాట్లాడుతూ.. వాడేట్టివార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ మురికి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. సమస్యలపై కాంగ్రెస్ తమతో పోరాడటం లేదని, ఇది పార్టీ ఓటమి మనస్తత్వాన్ని చూపుతోందని అన్నారు. కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వివాదాస్పదమైన తర్వాత తాజాగా మరో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version