Site icon NTV Telugu

Kamal Rashid Khan: వివాదాస్పద ట్వీట్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్

Kamal Rashid Khan

Kamal Rashid Khan

Kamal Rashid Khan: బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పూర్తి పేరు కంటే ”కేఆర్కే”గా ఆయన అందరికి సుపరిచితుడు. హిందీలో ఆయన కొన్ని సినిమాలు చేసినా.. వాటి వల్ల ఆయనకు గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో ఆయన చేసిన కాంట్రవర్సీ కామెంట్ల వల్ల ఆయన వెలుగులోకి వచ్చారు. 2020లో ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్‌పై కేసు మోదైంది. ఈ క్రమంలో ముంబై ఎయిర్‌పోర్టులో మలాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ బోరివాలి కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే రషీద్‌ ఖాన్‌.. ప్రముఖ బాలీవుడ్‌ సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆమిర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌.. ఇలా అందరు హీరోల మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. కేఆర్‌కే పాన్‌ ఇండియా తెలుగు చిత్రాలపై సైతం తన అక్కసును వెళ్లగక్కాడు.

Funny Video : అట్లుందటి మనతోని ముచ్చట.. ఈ వీడియో చూస్తే.. పొట్టచెక్కలే..

కమల్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నటుడు మనోజ్ బాజ్‌పాయ్ గతంలో కేసులు వేశారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వార్తల్లో ఉండటమే ముఖ్యం అన్నట్లు కేర్కే ట్వీట్లు చేస్తుంటారు. ”ఆర్ఆర్ఆర్” సినిమా గురించి కూడా నెగెటివ్ రివ్యూ ఇచ్చారు.

Exit mobile version