Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

  • ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం
  • ఎన్నికల్లో పోటీ కోసం అభ్యర్థుల నుంచి నగదు సేకరణ
  • తిరుగుబావుటా ఎగరేసిన పార్టీ నేతలు
Kamalhaasan

Kamalhaasan

తమిళనాడు ఎన్నికల వేళ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కమల్‌హాసన్‌పై పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగరేశారు. ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సుమారు 55 మందికి పైగా నేతలు తాము కట్టిన నగదును తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయంపై కమల్‌హాసన్ స్పందించలేదు.

ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అనూహ్యంగా కమల్‌హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. డీఎంకే మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆశావాహులంతా అవాక్కయ్యారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అప్పటికే కమల్‌హాసన్ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు సేకరించారు. ఇలా 55 మంది అభ్యర్థుల నుంచి డబ్బులు సేకరించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకేకు మద్దతు ఇవ్వడంతో అభ్యర్థులంతా తిరిగి తమ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇంకా కమల్ హాసన్ స్పందించలేదు.

ఇది కూడా చదవండి: Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరుగుతోంది. మరోసారి అధికారం కోసం డీఎంకే.. ఈసారైనా గెలవాలని అన్నాడీఎంకే పోటీ పడుతున్నాయి. ఇంకోవైపు అధికారంలోకి రావాలని టీవీకే చీఫ్ విజయ్ పోరాటం చేస్తున్నారు. అయితే తమిళ ప్రజలు ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో మే 4 వరకు వేచి ఉండాలి.

ఇది కూడా చదవండి: Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకుల పుకార్లకు అభిషేక్ బచ్చన్ చెక్..