NTV Telugu Site icon

Kailash Gahlot: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్

Bjp Delhi

Bjp Delhi

Kailash Gahlot: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేత కైలాశ్‌ గహ్లోట్ ఈ రోజు (సోమవారం) బీజేపీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పని చేసిన గహ్లోట్ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు లేఖ పంపారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం తీర్చలేని హామీలు ఇస్తోందని ఆరోపించారు.

Read Also: Raging in MBBS College: ఎంబీబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌.. 3 గంటలు నిలబడి డ్యాన్స్ చేస్తూ విద్యార్థి మృతి!

బీజేపీలో కైలాష్ గహ్లోట్ ఈ సందర్భంగా ఇది నాకు సులభమైన నిర్ణయం కాదన్నారు. అన్నా హజారే ఉద్యమం చేసే సమయంలో నేను ఆప్‌లో ఉన్నాను.. ఎమ్మెల్యే, మంత్రిగా ఢిల్లీకి నావంతు సేవలు అందించానని పేర్కొన్నారు. ఇక, నేను బీజేపీలో చేరడం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయమని కొందరు భావిస్తున్నారు.. అలాగే, ఒత్తిడి వల్లే కమలం గూటికి వచ్చినట్లు ఆరోపిస్తున్నారు.. ఒత్తిడి వల్ల ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి వచ్చిన ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ప్రజలు మళ్లీ తను మంచి వాడిని అనే సర్టిఫికెట్‌ ఇచ్చే వరకూ పదవిలో ఉండబోనని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అతిషిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత.. కైలాశ్‌ అసంతృప్తికి కారణం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమైతుంది.