NTV Telugu Site icon

MLC Kavitha: కవిత జ్యుడీషియల్‌ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు..

Kavitha Kastadi

Kavitha Kastadi

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈసారి కస్టడీని మరో నెలపాటు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కవితను జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించిన రూస్ అవెన్యూ కోర్టు.. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఇందుకోసం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు.

Read More: Medak: లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం..

కాగా.. మద్యం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అదుపులో తీసుకున్నారు అధికారులు. ఈ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న, కవితతో పాటు చరణ్‌ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ ఈడీ రూస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.

Read More: Khammam: లోక్​ సభ కౌంటింగ్ కు అంతా రెడీ.. స్ట్రాంగ్ రూమ్​ ల దగ్గర మూడంచెల భద్రత

ఏప్రిల్ 29న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. కవిత, చరణ్‌ప్రీత్‌లు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున.. వారికి కోర్టు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లు జూన్ 3న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా జూన్ 3తో ముగియనుంది. దీంతో సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Supreme Court: ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీం సీరియస్‌.. కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు