Site icon NTV Telugu

K. A. Paul: భారతదేశం త్వరలో వెనిజులా , శ్రీలంక కాబోతోంది

K.a.paul

K.a.paul

భారతదేశం త్వరలో వెనిజులా , శ్రీలంక కాబోతోందని కే.ఏ.పాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై బుధవారం రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేప‌డ‌తామ‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు. ధర్నాకి అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. కెసిఆర్, జగన్, పవన్ కళ్యాణ్ ఇతర పార్టీ కి చెందిన నాయకులు ధర్నాకు రావాలని కే.ఏ.పాల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మా ధర్నాకు మద్దతు పదినిమిషాలు నాతోపాటు కూర్చోవాలని డిమాండ్ చేసారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అంతా హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నన‌ని పేర్కొన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ పారాసిటీ మాల్ వేసుకోవాలని చెప్పారు, దాంతో లక్షల మంది చనిపోయారని వివ‌మ‌ర్శించారు.

read also: Prabhas Salaar : భయంకరమైన ఒక లోయలో యాక్షన్ సీన్

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బ్రస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కెసిఆర్ ప్రధాని అవుతాడని విదేశీయులు కుట్రపడ్డారని అందులో భాగంగానే క్లౌడ్ బ్రెస్ట్ జరిగిందనీ కెసిఆర్ కామెంట్స్ చేశాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేయడం ఏంటని కే.ఏ.పాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల్లో 9 పార్టీలతో జతకలిసాడ‌ని ఎద్దేవ‌చేసారు. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు అన్ని పార్టీలతో జత కలిశాడు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసారు. పవన్ కళ్యాణ్ ని ఎవరు నమ్మటం లేదు, అందుకోసమే ఒక్క లీడర్ కూడా ఆయన దగ్గర ఉండట్లేదని విమ‌వ‌ర్శించారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి నాయకులు పార్టీ విడిచి వెళ్లిపోయారని అన్నారు. త‌ను హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే గుజరాత్ లో పెట్టాలని బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం త‌ను హైదరాబాదులోనే గ్లోబల్ సమ్మిట్ పెడతానంటూ శ‌ప‌థం చేసారు. నేను రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడనని అన్నారు. 8 కోట్ల తెలుగు ప్రజల బాగుకోసం ఎంతకైనా వెళ్తానని అన్నారు. సీఎం కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పులు, జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్ల లక్షల అప్పులు చేశారని విమ‌ర్శించారు. ఆగస్టు 15 వరకు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాన‌ని కే.ఏ.పాల్ అన్నారు.

Prabhas Salaar : భయంకరమైన ఒక లోయలో యాక్షన్ సీన్

Exit mobile version