Site icon NTV Telugu

Pune Porsche Crash: నిందితుడు టీనేజర్ కాదు.. మైనరే.. పోలీసుల వాదన తోసిపుచ్చిన జువైనెల్ బోర్డు

Puneporschecrashcase

Puneporschecrashcase

పూణె కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కుర్రాళ్లు.. వేగంగా దూసుకెళ్లి ఇద్దరు టెకీల మరణానికి కారణం అయ్యారు. అయితే నిందితులకు గంటల వ్యవధిలోనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోర్టు తీరును ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం తప్పు తెలుసుకుని బెయిల్ రద్దు చేసింది.

ఇది కూడా చదవండి: Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!

అయితే ఇదే కేసులో తాజాగా పోలీసుల వాదనను జువైనెల్ జస్టిస్ బోర్డు తోసిపుచ్చింది. నిందితుడ్ని మైనర్ కాకుండా టీనేజర్‌గా గుర్తించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు జువైనెల్ జస్టిస్ బోర్డు తిరస్కరించింది. అతడ్ని మైనర్‌గానే విచారిస్తామని తీర్పు చెప్పింది. ఈ కేసు మొదటి నుంచి వివాదాస్పదంగానే సాగింది.

ఇది కూడా చదవండి: Minister Satya Kumar Yadav: వైసీపీపై మంత్రి సత్యకుమార్‌ ఫైర్.. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరారు..!

2024, మే 19న పూణెలోని కల్యాణినగర్‌లో 17 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో పోర్స్చే కారు వేగంగా నడపడంతో ఇద్దరు ఐటీ నిపుణులైన అనిష్ అవధియా, అశ్విని కోస్టా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ కేసులో కుటుంబ సభ్యులు సాక్ష్యాలను తారుమారు చేశారు. నిందితుడి రక్తనమునాలకు బదులుగా తల్లి నమునాలు సేకరించి ఆస్పత్రి వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇక న్యాయస్థానం కూడా గంటల వ్యవధిలో బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగడంతో నిందితులతో సహా సహకరించిన వారంతా జైలుకు వెళ్లారు. ముగ్గురు ససూన్ సిబ్బందితో పాటు, బాలుడి తండ్రి, మధ్యవర్తులు మకందర్, అమర్ గైక్వాడ్, ఆదిత్య అవినాష్ సూద్, ఆశిష్ మిట్టల్, అరుణ్ కుమార్ సింగ్ ప్రస్తుతం రక్త నమూనా మార్పిడి కేసులో జైలులో ఉన్నారు.

Exit mobile version