సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం సుప్రీం ధర్మాసనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం ఆయనకు చివరి పని దినం కావడంతో సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు తెలిపింది. నవంబర్ 9, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు చంద్రచూడ్‌కు రెండేళ్ల పదవీకాలం ఆదివారంతో ముగుస్తోంది. కానీ శుక్రవారమే ఆయనకు చివరి పని దినంతో వీడ్కోలు పలికారు.
ఇది కూడా చదవండి: 2024 Maruti Suzuki Dzire: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మారుతి సుజుకి డిజైర్..
ఈ సందర్భంగా చంద్రచూడ్ మాట్లాడారు… వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవమని పేర్కొన్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాను ప్రశంసించారు. సమర్థుడైన నాయకుడిగా అభివర్ణించారు. సమర్థుల చేతుల్లో ధర్మాసనాన్ని విడిచిపెట్టడం తనకు భరోసాగా ఉందని ఆయన అన్నారు. తాను ఎప్పుడైనా కోర్టులో ఎవరినైనా బాధపెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించాలని కోరారు. మరోవైపు సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. నవంబర్ 11న (సోమవారం) జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఇప్పటికే వెల్లడించారు. 2025 మే 13 వరకు సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు.
ఇది కూడా చదవండి: Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానులపై పాలస్తీనా అనుకూల గుంపు దాడి.. తీవ్రంగా స్పందించిన నెతన్యాహు