NTV Telugu Site icon

Haryana Violence: హర్యానా అల్లర్ల నుంచి తప్పించుకున్న జడ్జి.. నూహ్‌ జిల్లాలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Haryana Violence

Haryana Violence

Haryana Violence: హర్యానాలో కొనసాగుతున్న అల్లర్ల నుంచి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఒకరు త్రుటిలో తప్పించుకున్నారు. తనతోపాటు ఉన్న మూడేళ్ల చిన్నారి కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో నూహ్‌ జిల్లాలో గత 4 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో హర్యానాలోని నూహ్‌ జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో హరియాణాకు చెందిన ఓ జడ్జి, ఆమె మూడేళ్ల కుమార్తె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Read also: Taapsee : ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

సోమవారం ఘర్షణలు చోటుచేసుకున్న సమయంలో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జస్టిస్ అంజలి జైన్, ఆమె మూడేళ్ల కుమార్తె ప్రయాణిస్తున్న కారుపై అల్లరిమూక దాడి చేసింది. తొలుత రాళ్లతో దాడి చేసి తర్వాత కారుకు నిప్పంటిచారు. అప్పుడు కారులో జడ్జితో పాటు కొందరు సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా కారు దిగి నూహ్‌లోని పాత బస్టాండ్‌కు వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. తర్వాత వారిని కొందరు న్యాయవాదులు వచ్చి రక్షించారు. తెల్లారి వెళ్లి కారును చూడగా పూర్తిగా దహనమై కనిపించింది. ఈ ఘటనపై కోర్టు సిబ్బంది గుర్తు తెలియని దుండగులపై కేసు పెట్టారు. ప్రస్తుతం నూహ్‌(Nuh)లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.

Read also: Rythu Runa Mafi: తెలంగాణలో రుణమాఫీ షురూ.. తొలిరోజు 44,870 మంది రైతులకు లబ్ది

బుధవారం రాత్రి కొందరు దుండగులు రెండు ప్రార్థనా మందిరాలపై బాంబులు విసిరారు. దాంతో ఆ మందిరాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని గురువారం పోలీసులు తెలిపారు. అలాగే కొన్ని చోట్ల గోదాములు, దుకాణాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. నూహ్‌లో వరుసగా నాలుగో రోజు కర్ఫ్యూ అమల్లో ఉండటంతో గురువారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలను సడలించారు. నూహ్‌ జిల్లాలో మొదలైన ఘర్షణలు గురుగ్రామ్ సహా చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావం చూపడంతో ఢిల్లీలో భద్రతను పెంచారు. ఈ పరిస్థితులపై అమెరికా(USA) స్పందించింది. శాంతికి పిలుపునిచ్చింది. దీనివల్ల తమ దేశ పౌరులపై ఎలాంటి ప్రభావం పడిందనే అంశంపై ఎలాంటి సమాచారం లేదని అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు.