Site icon NTV Telugu

Waqf Bill 2024: నేడు వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం..

Waklf

Waklf

Waqf Bill 2024: వక్ఫ్ సవరణ బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ రోజు (గురువారం) సమావేశం జరగనుంది. బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో నేడు కొనసాగబోతుంది. కొంతమంది సభ్యుల అభ్యర్థన మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జేపీసీ చైర్‌పర్సన్, బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ తెలిపారు. ఇక, జగదాంబిక పాల్ విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది.. కానీ మా సభ్యులు కొందరు 17వ తేదీన గణేష్ చతుర్థి, ఈద్-ఎ-మిలాద్ కోసం ఊరేగింపు జరుగుతోందని చెప్పారు. దీంతో షెడ్యూల్ ప్రకారం బుధవారం నాటి సమావేశం సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరగనుంది.

Read Also: Devara : ఆంధ్ర – నైజాం ఏరియాల వారిగా దేవర డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్..

కాగా, నేటి సమావేశంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముందు మౌఖిక సాక్ష్యాలను నమోదు చేస్తారు. ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా లాంటి కొంతమంది నిపుణులు, వాటాదారుల అభిప్రాయాలు లేదా సూచనలను కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వింటుంది. వీరితో పాటు వైస్ ఛాన్సలర్, చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా, పస్మాండ ముస్లిం మహాజ్, ఆల్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు, అఖిల భారత సజ్జదనాశిన్ కౌన్సిల్, అజ్మీర్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, ఢిల్లీ అండ్ భారత్ ఫస్ట్ కమిటీలు ఇచ్చే సలహాలు, సూచనలు జేపీసీ కమిటీ తీసుకోనుంది.

Exit mobile version