NTV Telugu Site icon

Nitish Kumar: ఎన్డీయేలోనే ఉంటా.. క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ తాను ఎన్డీయేలో ఉంటానని తన వైఖరిని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ‘‘మహాగట్‌బంధన్’’లో మళ్లీ చేరబోనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అన్నారు. ఉన్నత స్థాయి ఎన్డీయే సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నాయకుడు 2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే పోరాడుతామని ప్రకటించారు. మహాగటబంధన్‌తో పొత్తు పెట్టుకోవడంపై మాట్లాడుతూ.. తన పార్టీ సీనియర్ నాయకుల సలహా వల్ల చేసిన తప్పులుగా అభివర్ణించారు. ఆయితే ఆయన ఏ ఒక్కరి పేరు చెప్పలేదు.

Read Also: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు

వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా ఎన్డీయే కూటమి 220 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. వ్యక్తిగత పార్టీల కన్నా ఐక్యంగా పనిచేయాలనే ప్రాముఖ్యతని నొక్కిచెప్పారు. పంచాయతీ, బ్లాక్ స్థాయిలో ఇలాంటి సమావేశాలను నిర్వహించడం వల్ల ఎన్డీయే నాయకులు మరింత క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని నితీష్ కుమార్ శ్రేణులకు సూచించారు. సమావేశం అనంతరం బీహార్ యూనిట్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే పోటీ చేస్తుందని చెప్పారు. 2020 ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్యను అధిగమించాలని ఎన్డీయే ప్రతిష్టాత్మకంగా పెట్టుకుందని దిలీస్ జైశ్వాల్ అన్నారు.

మహాకూటమి బీహార్ ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసిందని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని చురుగ్గా ఎదుర్కోవాలని నితీష్ కుమార్ ఎన్‌డిఎ నాయకులను కోరారు. ఎన్డీయే విస్తరణని బలోపేతం చేయడానికి నితీష్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థాయి సమావేశాలతో కూడిన వ్యూహాన్ని వివరించారు. భవిష్యత్తులో కార్యక్రమాలను కూటమి నేతలు సమన్వయంతో, భాగస్వామ్యంతో చేయాలని సూచించారు. బీహార్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.