NTV Telugu Site icon

Mahua Maji: కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. జేఎంఎం ఎంపీకి తీవ్రగాయాలు

Mahua Maji

Mahua Maji

మహా కుంభమేళా బుధవారంతో ముగుస్తోంది. దీంతో చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. జార్ఖండ్‌లోని లతేహార్‌ ప్రాంతంలో ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎంపీ మహువాతో పాటు కుమారుడు, కుమారుడికి గాయాలయ్యాయి. ఎంపీకి తీవ్రగాయాలు కావడంతో రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూాడా చదవండి: Ravi Teja : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సీక్వెల్

ప్రమాదంపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంపీ ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. చేతికి సర్జరీ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.