Site icon NTV Telugu

Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా

Honeymoonmurder

Honeymoonmurder

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. నిందితులకు జితేంద్ర రఘువంశీ యూపీఐ ఖాతా నుంచి నగదు బదిలీ అయింది. సోనమ్ రఘువంశీ.. జితేంద్ర రఘువంశీ ఖాతా నుంచి నగదు బదిలీ చేసినట్లుగా మేఘాలయ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడెవరు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rayapati Sailaja: కాలం బాగోలేదు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.. మహిళ కమిషన్ చైర్ పర్సన్ కీలక వ్యాఖ్యలు..!

భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు భార్య సోనమ్.. కిరాయి హంతకులను నియమించుకుంది. మేఘాలయలో రాజా రఘువంశీని చంపిన తర్వాత నిందితురాలు సోనమ్.. హంతక ముఠాకు మే 23న జితేంద్ర రఘువంశీ పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ నగదును హవాలా రూపంలో ఏమైనా బదిలీ చేసిందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్‌న్యూస్..! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో..!

అయితే ఈ ఆరోపణలను సోనమ్ సోదరుడు గోవింద్ ఖండించాడు. జితేంద్ర రఘువంశీ తమ బంధువేనని.. కజిన్ అని పేర్కొన్నాడు. హవాలాతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. కుటుంబ వ్యాపారంలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అతడి పేరు మీద ఉన్న ఖాతాలోని డబ్బులన్నీ తమవేనని.. ఖర్చుల నిమిత్తం ఖాతాలో జమ చేస్తామని వివరణ ఇచ్చాడు. సోనమ్ యూపీఐ ఖాతా కూడా జితేంద్ర పేరుతోనే తెరిచినట్లు వివరించాడు. ఎందుకు జితేంద్ర పేరుతో ఖాతా తెరిచారని విలేకర్లు అడిగితే మాత్రం కారణాలు చెప్పకుండా దాట వేశాడు.

అయితే జితేంద్ర ఏమైనా సోనమ్ సహకరించాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా.. జితేంద్ర కూడా ఒకే దగ్గర పని చేస్తున్నారు. ఆ స్నేహం మీద ఒకవేళ సోనమ్‌కు ఏమైనా సహకరించాడేమోనన్న విధంగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

అయితే జితేంద్ర అలాంటి వాడు కాదని సోనమ్ సోదరుడు తోసిపుచ్చాడు. ఇటీవల రాజా రఘువంశీ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి వచ్చినట్లు తెలిపాడు. సోనమ్.. భర్తను చంపిందని వంద శాతం నమ్ముతున్నట్లు జితేంద్ర కూడా అన్నాడని చెప్పుకొచ్చాడు. ఘాజీపూర్‌ నుంచి సోనమ్ ఫోన్ చేసినప్పుడు ఆమె మాట తీరును బట్టి చూస్తే.. ఆమె నేరం చేసినట్టు అర్థమైనట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆమెతో సంబంధాలు తెంచుకున్నామని.. నేరం రుజువైతే మాత్రం ఉరి శిక్ష విధించాలని సోదరుడు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఇండోర్ వెళ్లి రాజా రఘువంశీ తల్లిని ఓదార్చి వచ్చాడు.

రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 23న అత్యంత దారుణంగా రాజాను సోనమ్ హంతక ముఠాతో చంపించింది. అనంతరం వారితో కలిసి భర్త మృతదేహాన్ని లోయలో తోసేసింది. అనంతరం ఇండోర్‌కు వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అటు తర్వాత యూపీకి పారిపోయారు. జూన్ 9న ఘాజీపూర్‌లో సోనమ్ లొంగిపోయింది. ప్రస్తుతం మేఘాలయ పోలీస్ కస్టడీలో నిందితులు ఉన్నారు.

Exit mobile version