BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఆ విమర్శలకు బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తే ఆయనలోని మహ్మద్ అలీ జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందని విమర్శించారు. ‘‘రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు, జిన్నా ఆత్మ లేదా అల్-ఖైదా వంటి వ్యక్తుల ఆలోచన అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. అతను భారతదేశానికి వచ్చిన తర్వాత మంచి భూతవైద్యుని నుండి భూతవైద్యం చేయించుకోవాలి’’ అని నఖ్వీ సూచించారు.
Read Also: Land Rates: ఏపీలో భూముల ధరలకు రెక్కలు..! రేపటి నుంచే అమలు
రాహుల్ గాంధీ సమస్య ఏంటంటే.. ప్రధాని నరేంద్రమోడీ అతని ప్యూడల్ వ్యవస్థను నాశనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నఖ్వీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని, రాజరికాన్ని సమానం అని భావిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ భారతదేశ పరువు తీసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నారని, కాంగ్రెస్ ముస్లింలను చూయింగ్ గమ్ లాగా ఉపయోగించుకుందని నఖ్వీ అన్నారు.
అంతకుముందు కాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. తన భారత్ జోడోయాత్రను ప్రభుత్వం అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని అన్నారు. మోడీని దేవుడితో కూర్చోబెడితే .. దేవుడికే విశ్వం ఎలా పనిచేస్తుందనేది చెబుతాడంటూ ఎద్దేవా చేశారు.