Site icon NTV Telugu

Lizard In Meal: స్కూల్ భోజనంలో బల్లి.. 110 మంది విద్యార్థులకు అస్వస్థత

Lizard In Meal,

Lizard In Meal,

Lizard In Meal: జార్ఖండ్ రాష్ట్రం పాకూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా 110 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గురువారం అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్తులు వాంతులు, తలనొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారు. భోజనంలో బల్లి పడటంతోనే ఇలా అయిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

Read Also: Hafiz Saeed: ముంబై దాడుల ఉగ్రవాది కుమారుడు మిస్సింగ్.. గజగజ వణుకుతున్న పాకిస్తాన్..

Read Also: US Visa: రికార్డ్ బద్ధలు..ఈ ఏడాది 10 లక్షల భారతీయులకు అమెరికా వీసాలు..

65 మంది విద్యార్థులను పశ్చిమబెంగాల్ లోని బీర్భూమ్ జిల్లా సమీపంలోని రాంపూర్‌హాట్ లోని ఆస్పత్రికి తరలించారు. మరో 45 మందిని పకురియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉంచారు. ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు రాంపూర్‌హాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారంతా డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఆహారంలో బల్లి కనిపించిందా..? అనేది విచారించాల్సి ఉందని చెప్పారు.

Exit mobile version