NTV Telugu Site icon

Jharkhand: ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా

Soran

Soran

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాంచీలోని  రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. జనవరి 31న అప్పటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు. దాదాపు 5 నెలల పాటు సీఎం పదవిలో ఉన్నారు. అయితే ఇటీవలే హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి సీటు అధిరోహించాలని భావించారు. దీంతో ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను గవర్నర్‌ను కలిసి అందించారు.

G