Site icon NTV Telugu

JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్ చేయండి..

Jee Advanced Results Min

Jee Advanced Results Min

JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్‌) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది. ఫలితాలతో పాటే తుది ఆన్సర్ కీ, మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు వచ్చింది. అభ్యర్థులు స్కోర్‌ కార్డులను jeeadv.ac.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్లవారీగా ఆయా వర్గాల కోటా ప్రకారం విడుదల చేశారు.

Mahindra XUV400 EV: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ ధర, రేంజ్, ఫీచర్లు ఇవే..

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ నెల 12 నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్‌ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో ఇవి సుమారు 13 శాతం. ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ సీట్లనూ కలిపితే అది 14 శాతానికి పెరుగుతుంది. ఆర్కిటెక్చర్‌ కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టుకు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఫలితాల కోసం: క్లిక్ చేయండి..

Exit mobile version