NTV Telugu Site icon

జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ వాయిదా.. అదే కార‌ణం..

JEE

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలంతో వివిధ రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించాల్సిన కామ‌న్ టెస్టులు, ఇత‌ర ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి.. ఇప్ప‌టికీ క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష వాయిదా ప‌డ్డాయి. ఈ మేర‌కు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. షెడ్యూల్ ప్ర‌కారం జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉండ‌గా.. కోవిడ్ క‌ల్లోలం కొన‌సాగుతున్నందున‌.. ప్ర‌స్తుతం నిర్వ‌హించ‌లేక‌పోతున్నామ‌ని వెల్ల‌డించింది.. అయితే, క‌రోనా ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌రీక్ష నిర్వ‌హ‌ణ తేదీల‌ను వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించారు.. మ‌రోవైపు.. ఏప్రిల్, మేలో జరగాల్సి న జేఈఈ మెయిన్ పరీక్షలు కూడా వాయిదా ప‌డ్డాయి.. ఆ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డం కూడా ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష వాయిదాకు కార‌ణంగా చెబుతున్నారు.