సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ ఎప్పుడూ గరం గరంగా ఉంటారు. రాజ్యసభలో ఛైర్మన్‌ను కూడా దడదడలాడిస్తుంటారు. తన పేరు పక్కన అమితాబ్ బచ్చన్ పేరును ఛైర్మన్ ఉచ్ఛరించినందుకు ఓ ఆటాడుకుంది. అంతలా ఫైర్‌బ్రాండ్‌గా ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నుంచి జయా బచ్చన్ వైదొలిగారు. బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే అధ్యక్షతన ఉన్న కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్యానెల్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఇకపై ఆమె లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉండనున్నారు.
ఇది కూడా చదవండి: Joe Biden: ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చు
ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ ప్యానెల్‌లో జయా బచ్చన్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన సాకేత్ గోఖలే నియమితులయ్యారు. జయా బచ్చన్ ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురులిగా ఉంటారని రాజ్యసభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. జలవనరులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన విభాగం సభ్యులుగా జేడీయూ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా, బీజేపీ సభ్యుడు ధైర్యశీల్ పాటిల్‌లను రాజ్యసభ ఛైర్మన్ నామినేట్ చేశారు.
ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..