Jaya Bachchan: జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల కీలక ప్రకటన

  • జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల కీలక ప్రకటన
  • మరణవార్తలను ఖండించిన బచ్చన్ కుటుంబ సభ్యులు
Jaya Bachchan Mother

Jaya Bachchan Mother

ప్రముఖ సీనియర్‌ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాదురి(94) మరణించారంటూ వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. బచ్చన్ ఫ్యామిలీ ఈ వార్తలను ఖండించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. తప్పుడు వార్తలతో అభిమానులను తప్పుదోవ పట్టించొద్దని కోరారు. ఇందిరా భాదురికి ఏమీ కాలేదని.. ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారని చెప్పారు. కచ్చితమైన సమాచారం వచ్చిన తర్వాతే వార్తలు ప్రచారం చేయాలని.. అంతే తప్పు తప్పుడు సమాచారంతో అభిమానులను గందరగోళంలోకి నెట్టొద్దని కోరారు.

ఇది కూడా చదవండి: Beer Bottles In Oil Tanker : ఇదెక్కడి మాస్‌రా మావా? ఆయిల్‌ ట్యాంకర్‌లో బీర్‌ బాటిళ్లు.. వీడియో వైరల్‌

ఇందిరా భాదురి(94) కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె భోపాల్‌లోని తన నివాసం ఉంటున్నారు. ఆమె భర్త, జర్నలిస్ట్‌ తరుణ్‌ భాడురి 1996లో కన్నుమూశారు. ఈ దంపతులకు జయ, రీతా, నీతా అని ముగ్గురు సంతానం ఉన్నారు.

ఇది కూడా చదవండి: North Korea: క్షిపణి స్థావరాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్