Site icon NTV Telugu

Rajya sabha: అమితాబ్ పేరు ప్రస్తావనపై జయా బచ్చన్ గరం గరం.. చైర్మన్‌పై ఆగ్రహం

Jayabachchanrajyasabha

Jayabachchanrajyasabha

రాజ్యసభలో మరోసారి రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అంటూ పూర్తి పేరుతో చైర్మన్‌ సంబోధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్‌ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Lavanya: లావణ్య ప్రయివేట్ పార్ట్స్ మీద శేఖర్ బాషా దాడి?

సభలో జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘అమితాబ్‌ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలం జయా బచ్చన్‌ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’’ అని జయా బచ్చన్‌ పేర్కొన్నారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్‌లో పేరు అలాగే ఉందని, కావాలంటే పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Sheikh Hasina: మా తల్లి మళ్లీ రాజకీయాల్లోకి రాదు.. షేక్ హసీనా కొడుకు కీలక వ్యాఖ్యలు

Exit mobile version