NTV Telugu Site icon

Chhattisgarh: 10 మంది మావోల మృతిని పురస్కరించుకుని జవాన్లు సంబరాలు.. తుపాకీలు చేతపట్టి డ్యాన్సులు

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో 10 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది అంతమొందించాయి. 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా జవాన్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 10 మంది మావోయిస్టులను హతం చేసిన జవాన్లు.. అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. విజయం సాధించిన ఆనందంలో తుపాకీలు చేతపట్టి.. జవాన్ల సమూహం డ్యాన్సులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Ban jokes on Sikhs: సిక్కులపై జోక్స్ నిషేధించాలి.. సుప్రీంకోర్టులో విచారణ..

ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్‌జీ బృందం (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్) శుక్రవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్న నక్కిన ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టారు. అనంతరం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు అక్కడికక్కడే హతం అయ్యారు. ఈ మేరకు 10 మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి మూడు ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ బిగ్ షాక్.. భారీగా ఉద్యోగుల తొలగింపు!