NTV Telugu Site icon

Prashant kishor: 14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ

Prashantkishor

Prashantkishor

బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం విరమించారు. జనవరి 2 నుంచి ఈ దీక్ష చేస్తున్నారు. బీహార్‌లోని మెరైన్ డ్రైవ్‌లోని సత్యాగ్రహ స్థలంలో నిరాహార దీక్షను విరమించారు. బీపీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవలను నిరసిస్తూ అభ్యర్థులకు మద్దతుగా నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎట్టకేలకు 14 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించి.. విద్యార్థులకు అండగా ఉంటానని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Justin Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాలకు ట్రూడో గుడ్ బై..

దీక్ష విరమణ అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. 14 రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినట్లు వెల్లడించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగినప్పుడు తాను గార్దానీబాగ్‌కు వెళ్లి తన గొంతు విప్పినట్లు చెప్పారు. అయినా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా లాఠీఛార్జ్ చేసిందన్నారు. పలుమార్లు లాఠీఛార్జ్ చేయడం వల్లే నిరాహార దీక్షకు కూర్చోవల్సి వచ్చిందన్నారు.

ఇది కూడా చదవండి: Allahabad HC: భార్య “మద్యం” సేవించడం ఒక్కటే విడాకులకు కారణం కాదు..

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన అధికారులపై రెండు రోజుల్లో హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. విద్యార్థులకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేసిన అధికారులను వదిలిపెట్టమని చెప్పారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సత్యాగ్రహం చేస్తామన్నారు. రెండు రోజుల్లో రిట్ పిటిషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. పోరాటంలో పాల్గొనేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇక బీహార్‌లోని రైతులు… హర్యానా, పంజాబ్ రైతుల తరహాలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరాహార దీక్షకు ముగింపు పలుకుతూ పవిత్ర గంగానదిలో కిషోర్ స్నానం చేశారు.

ఇది కూడా చదవండి: Brahmanandam: శేఖర్ కమ్ముల సినిమా రిజెక్ట్ చేసిన బ్రహ్మానందం కొడుకు !

Show comments