Site icon NTV Telugu

Jammu Kashmir: ఉగ్రవాదులకు, పాక్ ఇంటెలిజెన్స్‌కు భారత ఆర్మీ సమాచారం.. ఒకరి అరెస్ట్

Jammu Kashmir Spy

Jammu Kashmir Spy

Jammu Kashmir-person acting as a spy was arrested: భద్రతా బలగాలు, ఆర్మీకి సంబంధించి సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాకు చెందిన ముస్లిం మత గురువును అరెస్ట్ చేశారు. కాశ్మీరీ జన్‌బాజ్ ఫోర్స్ అనే పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థతో సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. భద్రతాబలగాలకు సంబంధించిన కదలికలు, ఫోటోలు వంటి సమాచారాన్ని కూడా ఉగ్రవాదులకు చేరవేసేందుకు సహకరించాడు.

అనుమానితుడిని 22 ఏళ్ల అబ్దుల్ వాహిద్ గా పోలీసులు గుర్తించారు. అతడు మదర్సాల ఉపాధ్యాయుడిగా.. కిష్త్వార్ల లోని ఒక మసీదులో మౌల్వీగా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2020 నుంచి కకాశ్మీరీ జన్‌బాజ్ ఫోర్స్ కమాండర్ తయ్యబ్ ఫరూఖీ అలియాస్ ఉమర్ ఖతాబ్ తో ఫేస్ బుక్ ద్వారా సన్నిహితంగా ఉంటున్నాడు వాహిద్. దీంతో పాటు ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కంటెంట్, ఫోటోలను షేర్ చేస్తున్నాడు. పాకిస్తాన్ కు చెందిన వ్యక్తికి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేసేవాడు వాహిద్.

Read Also: Asaduddin Owaisi: అమిత్ షా, కేసీఆర్‌లకు లేఖలు.. పాతబస్తీలో సెప్టెంబర్ 17న తిరంగా యాత్ర

భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల్లో అబ్దుల్ వాహిద్ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు కాశ్మీరీ జన్‌బాజ్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థలో ఉగ్రవాదిగా చేరాలని గతంలో ఆ సంస్థ ఆఫర్ కూడా చేసిందని వెల్లడించారు. ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేరడానికి ప్రేరేపించాలని.. భద్రతా దళాలకు చెందిన ఫోటోలు, కదలికలు, వీడియోలు పంపాలని కోరితే.. అందుకు వాహిద్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో పాటు భారత్ లోకి చొరబడే మార్గాలను గురించి టెర్రర్ గ్రూపులకు కూడా సమాచారం అందించాడనే అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వాహిద్ పై యూఏపీఏ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Exit mobile version