NTV Telugu Site icon

Jammu Kashmir: కాశ్మీరీ పండిట్ ను చంపిన టెర్రరిస్టులను లేపేసిన భద్రతా బలగాలు

J K

J K

కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయి భద్రతా బలగాలు. గురువారం రాహుల్ భట్ ను తన కార్యాలయంలో కాల్చి చంపిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు శుక్రవారం జరిగిని ఎన్ కౌంటర్ లో లేపేశాయి. ఒక రోజు వ్యవధిలోనే ఉగ్రవాదులను ట్రాక్ చేసి ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు.

గురువారం బుద్గాం జిల్లా చదూరా తాహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ క్లర్క్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులు కార్యాలయానికి వచ్చి రాహుల్ భట్ ను కాల్చిచంపారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను బుద్గాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీనగర్ లోని మహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలపాలై రాహుల్ భట్ మరణించారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనలకు కారణమైన ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతా బలగాలు. బందిపోరాలోని బ్రార్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం సాలిందర్ అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుపోయిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందని వారిగా.. పాక్ జాతీయులుగా గుర్తించారు అధికారులు.

ఇదిలా ఉంటే రాహుల్ భట్ అంత్యక్రియలు ఈ రోజు జరిగాయి. కాశ్మీర్ పండిట్లు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తమకు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించని పక్షంలో తాము ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు.