NTV Telugu Site icon

PM Modi: జమ్మూ కాశ్మీర్ యువత బుక్స్, పెన్స్ తీసుకెళ్తుంది.. రాళ్లు కాదు

Pm Modi

Pm Modi

PM Modi: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫేజ్-1లో రికార్డు స్థాయిలో 60.21 ఓటింగ్ నమోదైందని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు (గురువారం) ప్రశంసించారు. అలాగే, కాశ్మీర్ లో 50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. తాజాగా శ్రీనగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ.. కాశ్మీర్ ను దోచుకోవడం తమ జన్మహక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తించాయన్నారు. కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు.. పుస్తకాలు, పెన్నులు కనిపిస్తున్నాయని చెప్పారు. కాశ్మీర్ లో ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి. ఎయిమ్స్, ఐఐటి లాంటి న్యూస్ ఇప్పుడు కాశ్మీర్ లో వినిపిస్తుంది.. గతంలో లాల్ చౌక్ దగ్గర ఉగ్రదాడులు జరుగుతుండే.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Read Also: Karnataka : రిసార్టులో మహిళపై చిత్రహింసలు…బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు

అలాగే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న స్కూళ్లను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే.. వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ మూడు పార్టీలు స్టూడెంట్స్ చేతికి రాళ్లు ఇచ్చేవి అని ఆరోపించారు. తొలి విడత ఎన్నికల్లో కాశ్మీర్ ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పుకొచ్చారు.

Show comments