Site icon NTV Telugu

Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఉద్యోగాలు, ప్రేమ కావాలి.. బీజేపీ మాత్రం బుల్డోజర్లు పంపుతోంది…

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేఖంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఉపాధి, వ్యాపారం, ప్రేమ కావాలి, కానీ వారికి మీరు ఇచ్చిందేమిటి అని ప్రశ్నించారు. వీటికి బదులుగా బీజేపీ బుల్డోజర్లను పంపుతోందని విమర్శించారు. ఐక్యత శాంతిని కాపాడుతుందని కానీ.. ప్రజలను విభజించడం ద్వారా కాదని ఆదివారం ట్వీట్ చేశారు.

Read Also: Varisu: యుట్యూబ్ ని షేక్ చేస్తున్న జిమిక్కీ పొన్ను…

జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వారి నుంచి విముక్తి చేయడానికి ప్రత్యేకమైన డ్రైవ్ ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. అయితే పెద్ద వ్యక్తుల ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని.. పేదలకు, తక్కువ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఏం నష్టం జరగదని ప్రభుత్వం వెల్లడించింది. ఆక్రమణలన్నింటినీ తొలగించేందుకు జనవరి 31వ తేదీని ప్రభుత్వం గడువుగా నిర్ణయించింది. దీనికి వ్యతిరేకం దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 1న సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్రమంగా భూమిని లాక్కున్న వ్యక్తులు మాత్రమే తొలగింపును ఎదుర్కొంటున్నారని.. అమాయకులకు ఏం కాదని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, పీడీపీ, అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ఆజాద్ పార్టీలతో సహా వివిధ పార్టీలు కూల్చివేతలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ శనివారం మాట్లాడుతూ, తమ పార్టీ స్థానికేతరులను కేంద్రపాలిత ప్రాంతంలో స్థిరపడటానికి అనుమతించదని అన్నారు.

Exit mobile version