Site icon NTV Telugu

Randhir Jaiswal: కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు

Indus Water Treaty

Indus Water Treaty

కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రుణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్‌కు సంబంధించిన సమస్యలను భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనేదే దీర్ఘకాల జాతీయ వైఖరి అని తెలిపారు. ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలేయాలని తెలిపారు.

ఇది కూడా చదవండి: Indus Water treaty: అప్పటి వరకు నీళ్లు లేవు.. “సింధు జలాల ఒప్పందం”పై విదేశాంగ శాఖ స్పష్టత..

ఈ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. అణు బెదిరింపులను ఏ మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. భారత్ నుంచి సైనిక చర్య పూర్తిగా సంప్రదాయ డొమైన్‌లోనే జరిగిందన్నారు. భారత్ అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగదని తేల్చి చెప్పారు. అణు బెదిరింపుతో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే.. ఏ మాత్రం సహించబోమన్నారు. పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Operation Sindoor: పాక్‌లో ధ్వంసమైన ప్రాంతాలివే.. ఉపగ్రహ చిత్రాలు విడుదల

 

 

Exit mobile version