NTV Telugu Site icon

Jaishankar: షేక్ హసీనా గురించి యూకే విదేశాంగ కార్యదర్శితో జయశంకర్ ఫోన్ సంభాషణ

Uk

Uk

బంగ్లాదేశ్‌లో అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. ఇదే అంశంపై యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఫోన్‌లో సంభాషించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’ ఖాతా వేదికగా వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఇతర పరిణామాలపై లామీతో చర్చించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Indian Hockey Team: భారత పురుషుల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని..

షేక్‌ హసీనా యూకే ఆశ్రయం కోరారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే… షేక్‌ హసీనా భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే విషయంపై ఇప్పటివరకు ఇటు భారత్‌ గానీ, అటు యూకేగానీ స్పందించలేదు. ఆశ్రయం పొందేందుకు యూకేకు వెళ్లాలనుకొనే వ్యక్తులకు ప్రత్యేక అనుమతి ఇచ్చేందుకు తమ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు అనుమతించడంలేదని యూకే హోం ఆఫీస్‌ వర్గాలు తెలిపినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ అక్రమాలపై విచారణ… ఇప్పటికీ దొరకని ఆచూకీ..

ఇదిలా ఉంటే షేక్‌ హసీనాతో పాటు భారత్‌కు వచ్చిన ఆమె టీమ్‌లోని సభ్యులు ఇక్కడి నుంచి గుర్తు తెలియని ప్రదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. షేక్‌ హసీనా తన సోదరి రెహానా, కొందరు సన్నిహితులతో కలిసి దాదాపు కట్టుబట్టలతో భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. అయితే వారికి అవసరమైన దుస్తులు, వస్తువుల్లేక ఇబ్బందులు పడగా.. ప్రోటోకాల్‌ కార్యాలయ సభ్యులు సహకరించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ముహమ్మద్ యూనస్‌కి మోడీ శుభాకాంక్షలు..

Show comments