NTV Telugu Site icon

Jammu Kashmir: జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుల్గామ్ లో భద్రతా బలగాలు శుక్రవారం జైషే మహ్మద్ మాడ్యూల్ ను చేధించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్, రెండు మోర్టల్ షెల్స్, భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Pakistan: పతనం అంచున పాకిస్తాన్.. ఏడాదిలో పాతాళానికి విదేశీమారక నిల్వలు

కుల్గామ్ జిల్లాలోని మిర్హామా, డిహెచ్ పొరా ప్రాంతాల్లో పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సోదాలు చేయడంతో వీరు చిక్కారు. భద్రతా దళాలు ఒక పిస్టల్, మ్యాగజైన్, 18 రౌండ్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, నాలుగు యుబిజిఎల్ షెల్, 30 ఎకె 47 రౌండ్లు, 446 ఎం4 రౌండ్లు, ఎనిమిది ఎం4 మ్యాగజైన్లు, ఒక ఎకె 47 మ్యాగజైన్, ఒక ఇన్సాస్ మ్యాగజైన్, రెండు మోర్టార్ షెల్స్, వైర్‌లెస్ సెట్, నాలుగు వాకీ టాకీలు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ఆరుగురు తీవ్రవాదులు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాకిస్తాన్ లోని హ్యాండ్లర్లతో టచ్ లో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాంబు దాడులు చేయడం, ప్రజలను భయపెట్టడం, పంచాయితీ రాజ్ సంస్థ సభ్యులు, మైనారిటీ వర్గాలపై కాల్పులు జరపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది.