Site icon NTV Telugu

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం..

Bus Catches Fire

Bus Catches Fire

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలతో సహా 19 మంది సజీవ దహనమయ్యారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

Read Also: Mohammed Shami: నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు?.. సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు

సమాచారం ప్రకారం, జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేలోని థాయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. జైసల్మేర్ ప్రయాణం మొదలైన తర్వాత దాదాపు 20 కి.మీ దూరంలో బస్సు వెనక నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్, ప్రయాణికులు స్పందించే లోపే మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి.

ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు అద్దాలను పగటగొట్టి బయటకు దూకారు. చాలా మంది ప్రయాణికులు బ్యాగులు, వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక గ్రామస్తులు సహాయకచర్యల్ని ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సు ఇంజన్, లేదా వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు. గవర్నర్ హరిభావు బగాడే, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్ , ఇతర నాయకులు ఈ విషాద సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Exit mobile version