Jairam Ramesh Fires On Narendra Modi Over India China Issue: భారత్ – చైనా సరిహద్దుల్లో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోందని, మోడీ మెతక వైఖరి వల్లే డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతోందని అన్నారు. ‘‘భారత సైన్యం ధైర్యసాహసాలపై మాకెంతో గర్వం ఉంది. సరిహద్దులో చైనా చర్యలు ఆమోదయోగ్యం కాదు. గత రెండేళ్ల నుంచి మేము ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, ఈ సరిహద్దు నిజాల్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. దీంతో చైనా దుస్సాహసం పెరుగుతోంది’’ అంటూ ఫైర్ అయ్యారు.
Twitter: సరికొత్తగా ట్విట్టర్.. మూడు రంగుల వెరిఫికేషన్ టిక్ అమలు
మరో ట్వీట్‌లో.. ‘‘దేశం కంటే ఎవరూ పెద్దవారు కాదు. కానీ, మోడీ తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం దేశాన్నే ప్రమాదంలో పడేశాడు. ఉత్తర లదాఖ్‌లో చొరబాట్లను శాశ్వతం చేసే ప్రయత్నంలో భాగంగా.. డేప్‌సాంగ్‌లోని ఎల్ఏసీకి 15-18 కిలోమీటర్ల సరిహద్దులో 200 శాశ్వత ఆశ్రయాల్ని నిర్మించింది. కానీ, మోడీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో ఆందోళనకరమైన పరిణామం (భారత్ – చైనా సరిహద్దు ఘర్షణ) తెరమీదకి వచ్చింది’’ అంటూ జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. చైనా చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ.. మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా.. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్ఏసీ వెంబడి ప్రాంతంలో చైనా బలగాలు అడుగుపెట్టగా.. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో.. ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో భారత్‌తో పోలిస్తే చైనా సైనికులే ఎక్కువమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం ఇరు దేశాల బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాయి.
Umbrella Controversy: సీఎం స్టాలిన్ సతీమణికి దేవుని గొడుగు …వివాదం అవుతున్న వ్యవహారం